విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్, ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించి కొత్త చరిత్రను లిఖించారు. ఈ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి తన రాజకీయ సత్తా చాటారు.

​ఈ అద్భుత విజయంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మిత్రుడు విజయ్‌కు ‘X’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ అద్భుత విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు. ప్రజలు నీపై ఉంచిన నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనం. ఈ విజయం తమిళనాడులో అర్థవంతమైన అభివృద్ధికి దారితీస్తుందని నమ్ముతున్నాను” అంటూ మహేష్ బాబు ఆకాంక్షించారు.

​మహేష్ బాబు మరియు విజయ్ మధ్య గత దశాబ్దాలుగా మంచి స్నేహబంధం కొనసాగుతోంది. వీరిద్దరి సినిమాలు పరస్పరం రీమేక్ అయ్యి రెండు భాషల్లోనూ ఘనవిజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో విజయ్ సాధించిన ఈ సంచలన విజయంపై మహేష్ బాబు స్పందించడం పట్ల ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version