రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన మహేష్-సుకుమార్ క్రేజీ మూవీ..!

1-Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘1 నేనొక్కడినే’ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని, మే 31న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందింది. విడుదల సమయంలో కలెక్షన్ల పరంగా మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, కాలక్రమేణా ఇది తెలుగు సినిమాలో బెస్ట్ ఎక్స్‌పరిమెంటల్ చిత్రంగా నిలిచి ‘కల్ట్ స్టేటస్’ పొందింది. ఈ సినిమాలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని చిన్నప్పటి మహేష్‌గా నటించడం విశేషం.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే సంగీతం, రత్నవేలు విజువల్స్ మరియు మహేష్ బాబు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 4K టెక్నాలజీతో రాబోతున్న ఈ సినిమా మే నెలాఖరున థియేటర్లలో ఎలాంటి రెస్పా్న్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version