మహేశ్‌ బాబు కొత్త లుక్‌ పై క్రేజీ అప్ డేట్ !

మహేశ్‌ బాబు కొత్త లుక్‌ పై క్రేజీ అప్ డేట్ !

Published on Aug 15, 2022 8:01 AM IST

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన కొత్త లుక్‌ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పైగా ఈ లుక్‌ అంటే తనకు బాగా ఇష్టమని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఈ లుక్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ లుక్ ఈ సినిమాలోదే అని టాక్ నడుస్తోంది. ఈ లుక్ త్రివిక్రమే దగ్గర ఉండి డిజైన్ చేయించాడని కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. కాగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా మహేష్ కి సరిపోయే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు.

పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు