తన హీరోయిన్ కి మహేష్ సూపర్ స్పెషల్ విషెష్!

Published on Oct 17, 2021 1:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో అభినయ నటి కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈరోజు కీర్తీ సురేష్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే మహేష్ తో పాటు సర్కారు వారి పాట లో మొట్ట మొదటి సారిగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మహేష్ తన హీరోయిన్ కి కూడా స్పెషల్ విషెష్ తెలిపారు. కీర్తీ కి అంతులేని ఆనందం అలాగే మంచి సక్సెస్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని మహేష్ తన స్పెషల్ విషెష్ ని ఆమెకి తెలియజేసాడు. దీనితో ఇద్దరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :