“హీరో” టీం కి సూపర్ స్టార్ సూపర్ అప్లాజ్.!

Published on Jan 16, 2022 9:00 am IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన పలు చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మరో యంగ్ హీరో అశోక్ గల్లా నటించిన తాజా చిత్రం “హీరో” కూడా ఒకటి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ నడుమ విడుదల అయ్యింది.

అయితే ఆడియెన్స్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి గాను మహేష్ రిలీజ్ కి ముందు కూడా తన ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమాకి తన వంతు బూస్టప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమా సక్సెస్ కావడంతో మహేష్ తన అప్లాజ్ ని సినిమా యూనిట్ అంతటికీ తెలిపాడు.

అలాగే యంగ్ హీరో అశోక్ గల్లా కోసం మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేసాడు. బిగ్ స్క్రీన్ పై నిన్ను చూడడం చాలా ఆనందంగా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇంకా నీ నుంచి మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాని మహేష్ మరింత స్థాయిలో తన సపోర్ట్ వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :