మహేశ్ బాబు గొప్ప మనసు.. నిరుపేద చిన్నారుల కోసం మరో ముందడుగు..!

Published on Mar 5, 2022 8:30 pm IST


సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటాడన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది నిరుపేద చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు తాజాగా మరో ముందడుగు వేశాడు. హార్ట్ సర్జరీల నిమిత్తం ఇప్పటికే రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ తాజాగా ఈ సేవల్ని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేసింది.

రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనున్నామని సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడుతూ చిన్నారులు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారని, కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక వీటితో పాటు ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :