బ‌జ్.. అభిమానుల కోసం బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న మ‌హేష్..?

బ‌జ్.. అభిమానుల కోసం బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తోన్న మ‌హేష్..?

Published on Jul 6, 2024 6:40 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న కెరీర్ లోని 29వ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెకక్ట‌ర్ ఎస్ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌టంతో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ అయినా వ‌స్తుందేమో అని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

అయితే, మ‌హేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవ‌ర్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఓ క్రేజీ గిఫ్ట్ ను రెడీ చేస్తున్నాడ‌ట మ‌హేష్‌. ఆగ‌స్టు 9న మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు కానుక‌గా ఈ ఇనిమా కాన్పెస్ట్ వీడియో రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. దీనిపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇప్ప‌టికే ప‌నులు కూడా స్టార్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

కాగా, రాజ‌మౌళి త‌న కొత్త సినిమాను ప్ర‌తిసారి ఓ మీడియా స‌మావేశం పెట్టి అనౌన్స్ చేస్తుంటారు. ఈసారి కూడా అదే త‌ర‌హాలో అనౌన్స్ మెంట్ చేస్తార‌ని.. ఆ త‌రువాత ఆగస్టు 9న కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి నిజంగానే మ‌హేష్ త‌న అభిమానుల‌కు బ‌ర్త్ డే ట్రీట్ రెడీ చేస్తున్నాడా.. అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు