మాస్ లుక్ లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ ?

Published on May 20, 2023 3:01 am IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB 28 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ ని జూన్ 7 నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న SSMB 28 ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ గ్లింప్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుంగీ తో మాస్ లుక్ లో ఫ్యాన్స్ ని థ్రిల్ చేయనున్నారట. అలానే గ్లింప్స్ లో థమన్ బీజీఎమ్ కూడా అదరగొట్టనున్నారని, మొత్తంగా అయితే ఈ మూవీ గ్లింప్స్ అందరి అంచనాలు అందుకునేలా కట్ చేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ మూవీని 2024 జనవరి 13న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :