
‘ సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందొ తెలియదు గానీ… పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది.’ అంటూ ‘ఆగడు’ ఫస్ట్ టీజర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సెకండ్ టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ‘ఆగడు’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఆగస్ట్ 8వ తేది వరకు చిత్రీకరణ జరుగుతుంది. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ కోసం మూవీ యూనిట్ నార్వే వెళ్తుంది. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే. అభిమానులకు పుట్టినరోజు కానుకగా సెకండ్ టీజర్ విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఇంటర్నెట్, సోషల్ మీడియాలలో సినిమాకు కావలసినంత ప్రచారాన్ని తీసుకురావడంలో టీజర్లు ఉపయోగపడుతున్నాయి.
మహేష్ బాబు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. శృతి హాసన్ ప్రత్యేక గీతంలో నటించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.