మహేశ్ చేతుల మీదుగా ‘మెగా యూఫోరియా’ అప్డేట్..!

Published on Aug 21, 2021 11:06 pm IST

మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు రేపు కావడంతో ఆయన సినిమాల నుంచి అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. నేడు చిరు 153వ చిత్రం మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” రీమేక్‌కి “గాడ్‌ ఫాదర్‌” టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేపు సాయంత్రం 4.05 గంటలకు చిరు-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి సంబంధించి మెగా వేవ్‌ పేరుతో అప్డేట్ వస్తుంది.

ఇదే కాకుండా చిరు-మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో వస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి కూడా రేపు అప్డేట్ రాబోతుంది. రేపు ఉదయం 9 గంటలకు ‘మెగా యూఫోరియా’ అప్డేట్‌తో సినిమా టైటిల్‌ని వెల్లడించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ అప్డేట్ విడుదల కానుంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం :