మ‌హేష్ మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్ కి ఛాన్స్ ఇచ్చాడా..?

మ‌హేష్ మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్ కి ఛాన్స్ ఇచ్చాడా..?

Published on Jun 18, 2024 3:01 AM IST

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌హేష్ కెరీర్ లో 29వ మూవీగా రాబోతున్న ఈ సినిమాను రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ను త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మ‌హేష్ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ వార్త సినీ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. రాజ‌మౌళి మూవీ త‌రువాత మ‌హేష్ కెరీర్ లో 30వ సినిమాను తెర‌కెక్కించేందుకు ఇప్ప‌టికే ముగ్గురు ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ సినిమాను సుకుమార్, కొర‌టాల శివ‌, సందీప్ రెడ్డి వంగ లో ఒక‌రు డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇక 31వ సినిమాను మ‌రోసారి త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కించాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. రీసెంట్ గా వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి రెస్పాన్స్ ను ద‌క్కించుకుంది.

దీంతో ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను రెడీ చేయాల్సిందిగా మ‌హేష్ త్రివిక్ర‌మ్ ని కోరాడ‌ట‌. మ‌రి నిజంగానే మ‌హేష్ మ‌రోసారి త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో సినిమా చేస్తాడా అనేది తెలియాలంటే, దీనిపై అఫీషియ‌ల్ అప్డేట్ వ‌చ్చే వర‌కు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు