లీక్డ్ వీడియో పై మహేష్ ఫ్యాన్స్ రియాక్షన్

Published on Mar 27, 2023 7:46 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ SSMB28 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను సైతం నిన్న చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే, తాజాగా ఈ ఫస్ట్ లుక్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. ఇందులో మహేష్ స్వాగ్ చాలా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ వీడియోని షేర్ చేయొద్దు అంటూ మహేష్ ఫ్యాన్స్ కోరుతూ నెటిజన్లకు మెసేజ్ లు చేస్తున్నారు.

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని ఈ సినిమాని నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2023 సంక్రాతికి విడుదల చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :