రామ్ చరణ్ మూవీలో మహేష్ విలన్ ?

Published on Jul 21, 2022 1:30 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రముఖ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఒక భారీ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ నీ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కోలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన ఎస్ జే సూర్య ఒక కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ తీసిన స్పైడర్ మూవీలో విలన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కి కూడా ఆకట్టుకున్న సూర్య, ప్రస్తుతం చరణ్ మూవీలో ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో కనిపించనున్నారని, సినిమాలో ఆయన రోల్ ఆడియన్స్ బి అలరిస్తుందని అంటున్నారు. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :