“సర్కారు వారి పాట” కోసం బాబు ల్యాండ్ అయ్యేది అప్పుడే!

Published on Dec 21, 2021 6:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ ని మళ్ళీ చాలా కొత్తగా తనలోని 2.0 వెర్షన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల ప్రెజెంట్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ చాలా మేర సినిమాని కంప్లీట్ చేసేసిన మహేష్ ఇపుడు చిన్న సర్జరీ తర్వాత రెస్ట్ మోడ్ లో ఉన్నారు.

ప్రస్తుతం దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్న మహేష్ ఈసారి కొత్త సంవత్సరం వేడుకలని అక్కడే చేసుకోనున్నారట. ఇక సర్కారు వారి పాట బ్యాలన్స్ షూట్ ని కంప్లీట్ చెయ్యడానికి బాబు ఎప్పుడు ల్యాండ్ అవ్వబోతున్నాడో అనేది కూడా తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబు వచ్చే ఫిబ్రవరి నాటికి నార్మల్ అయ్యిపోతారట.

ఇక అదే ఫిబ్రవరి నుంచి మహేష్ సర్కారు వారి పాట సెట్స్ లో అడుగు పెట్టనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. సో బాబు ఆగమనం అప్పటికి కన్ఫర్మ్ అయ్యింది. ఇది అయ్యాక సినిమాని మాత్రం అనుకున్న డేట్ ఏప్రిల్ 1నే ప్రపంచ వ్యాపంగా గ్రాండ్ రిలీజ్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :