తారక్ షోలో మహేశ్ ఎంత గెలుచుకున్నాడంటే?

Published on Nov 27, 2021 1:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన వాక్చతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు తిరుగులేని టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నాడు ఎన్టీఆర్. ఇకపోతే ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చి అలరించారు.

అయితే తాజాగా సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. మహేశ్‌ బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ త్వరలోనే ప్రసారం కానుంది. ఈ క్రమంలో అసలు మహేశ్ బాబు ఎంత మొత్తాన్ని గెలుచుకున్నాడనేది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఈ షోలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు 25 ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్న‌ట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు గెలుచుకున్న మొత్తాన్ని కూడా మహేశ్ ఛారిటీ కోసం కేటాయించి మంచి మనసు చాటుకున‍్నాడట. ఏదేమైనా ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :