తారక్ షోలో మహేశ్ బాబు ఎంత గెలుచుకున్నాడంటే?

Published on Sep 22, 2021 2:08 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ “మీలో ఎవరో కోటీశ్వరులు” షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన వాక్చతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు తిరుగులేని టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నాడు ఎన్టీఆర్. ఇకపోతే ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఈ షో ప్రారంభం రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చి 25 లక్షలు గెలుచుకుని అలరించగా, మొన్న దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంది.

అయితే మ‌హేష్ బాబు కూడా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి హాజరయ్యారని, ఈ షోలో ఆయన పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్న‌ట్టు ప్రచారం జరుగుతుంది. మొన్న ఆదివారమే ఈ షూట్ కంప్లీట్ చేశారని, ఈ ఎపిసోడ్ దసరాకు ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఓ పక్క బిగ్‌బాస్, మరో పక్క ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. టీఆర్ఫీని పెంచుకోవడానికి రెండు షోలు తెగ పోటీపడుతున్నాయి.

సంబంధిత సమాచారం :