మహేష్ బాబు గ్యాప్ ఇవ్వడం లేదు.. ఫుల్ బిజీ

మహేష్ బాబు గ్యాప్ ఇవ్వడం లేదు.. ఫుల్ బిజీ

Published on Feb 7, 2023 8:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభించబడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొంటున్నాడు. SSMB28కి సంబంధించిన షూట్ ను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి మహేష్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగా షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి చేసుకున్నా.. వెంటనే మరో షెడ్యూల్ మొదలుపెట్టారట.

గ్యాప్ లేకుండా ఇలా వరుస షెడ్యూల్స్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, SSMB28కి సంబంధించిన షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అన్నట్టు పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు