మహేష్ సినిమాలో నాటితరం హీరోయిన్!

Nadhiya-Moidu
సూపర్ స్టార్ మహేష్, సౌతిండియన్ పాపులర్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‍ల కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే ఏదో ఒక వార్తతో హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్‌కు విలన్‌గా ఎస్.జె.సూర్య, హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ ఖరారవ్వగా, తాజాగా ఈ నటీనటుల జాబితాలోకి నాటితరం స్టార్ హీరోయిన్ నదియా కూడా వచ్చి చేరారు.

తెలుగులో ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘అ..ఆ..’ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న నదియా, ఇప్పుడు మహేష్ సినిమాతో మరో పెద్ద సినిమాలో నటించనుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆమె, ఎస్.జె.సూర్యకు భార్యగా నటించనున్నారని సమాచారం అందుతోంది. హరీస్ జైరాజ్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్-ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళనుంది.