అఫీషియల్: “సర్కారు వారి పాట” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Nov 3, 2021 4:28 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1, 2022 కి విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ తో ప్రకటించింది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలో షురూ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ మరియు GMB ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రం లో స్టైలిష్ గా మరియు ఎనర్జిటిక్ గా కనిపిస్తుండటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :