స్పైడర్ వాయిదా పక్కా అయింది !

22nd, April 2017 - 02:04:18 PM


మహేష్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్పైడర్ చిత్రాన్ని త్వరగా చూడాలని ఆరాటపడుతున్న అభిమానులకు ఇది చేదు వార్తే. ఈ చిత్ర విడుదల వాయిదా పడింది.ముందుగా ప్రకటించినట్లుగా ఈచిత్రం జూన్ 23 న విడుదల కాడంలేదు.

తమ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు స్పైడర్ నిర్మాతలు చిత్ర పరిశ్రమలోని ఇతర నిర్మాతలకు తెలియజేసారు. దీనితో అల్లుఅర్జున్ డీజే చిత్రం ఆ స్థానంలో విడుదలకు సిద్ధమైంది.స్పైడర్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలలో కూడా చాలా ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. ద్విభాషా చిత్రంగా వస్తున్న స్పైడర్ తదుపరి విడుడుదల తేదీపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చిత్ర యూనిట్ తదుపరి విడుదల తేదీ గురించి చర్చిస్తుననట్లు తెలుస్తోంది.