మహేష్ బాబు ని డైరెక్ట్ చేయడంలో బిజీగా ఉన్న త్రివిక్రమ్
Published on Sep 29, 2016 5:33 pm IST

trivikram-mahesh
వాణిజ్య ప్రకటనల పరంగా టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు టాప్ పొజీషన్ లో ఉన్నాడు. తమ్స్ అప్, సంతూర్, జొస్ అలూక్కాస్, ఐడియా వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నటించాడు మహేష్. ఇప్పుడు కూడా అయన అభిబస్ అనే ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నటిస్తున్నాడు. ఈ అడ్వర్టైజ్మెంట్ ను ప్రముఖ దర్శకుడు, మహేష్ బాబుతో ‘అతడు, ఖలేజా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ షూటింగ్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఈ ప్రకటన కోసం మహేష్ భారీగానే పారితోషకం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాడ్ లో పాల్గొనడానికి మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమాకి సైతం బ్రేక్ ఇచ్చారు. దీంతో మురుగదాస్ టీమ్ కూడా అహమ్మదాబాద్ లో లొకేషన్లు వెతుక్కునే పనిలో పడింది.

 
Like us on Facebook