తారక్ తో షూట్ కంప్లీట్ చేసేసిన మహేష్..టెలికాస్ట్ అప్పుడేనా?

Published on Sep 20, 2021 9:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే గ్రాండ్ షో ని అత్యద్భుతంగా హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ షోకి మరింత ఎంటర్టైన్మెంట్ జోడించేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో తళుక్కుమంటారు. మరి అలా ఈ షోలో తారక్ తో కలిసి గేమ్ ఆడేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ సాలిడ్ ఎపిసోడ్ పైనే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ షూట్ అట అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్న కంప్లీట్ అయ్యిపోయిందట అలాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని మేకర్స్ దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఎపిసోడ్ తో భారీ టీఆర్పీ రావడం మాత్రం గ్యారంటీ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :