వాహ్..’కళావతి’ ఐకానిక్ స్టెప్ కి మహేష్ ని బీట్ చేసిన సితార.!

Published on Feb 20, 2022 12:56 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ పక్కా మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ నుంచి మేకర్స్ రీసెంట్ గా ది మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ ని థమన్ అత్యద్భుతంగా కంపోజ్ చేయగా విజువల్ గా మైండ్ బ్లోయింగ్ లెవెల్లో దర్శకుడు తెరకెక్కించాడు. మరి ఈ సాంగ్ లో మహేష్ చేసిన ‘కళావతి’ ఐకానికా స్టెప్ అయితే ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ స్టెప్ ని మహేష్ కూతురు సితార రీ క్రియేట్ చేసి మహేష్ ని బీట్ చేసే లెవెల్లో చేసింది.

దీనితో ఈ అద్భుతమైన వీడియో ని మహేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అయితే సితార చేసిన ఈ వీడియో మాత్రం ఎవరైనా ‘వారే వాహ్’ అనకుండా ఉండలేరు.. మరి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా రానున్న మే 12న ఈ చిత్రం విడుదల కానుంది.

రీల్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :