ఎదురు చూపుల్లో మహేష్ అభిమానులు !
Published on Jun 1, 2017 9:07 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ చిత్రం యొక్క టీజర్ ఇంకొద్దిసేపట్లో విడుదలకానుంది. చిత్ర టీమ్ 10 గంట 30 నిముషాలకు టీజర్ విడుదల చేస్తామని ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ నిముషాలు లెక్కపెట్టుకుంటూ పదిన్నర ఎప్పుడవుతుందా అని ఎదురు చూపుల్లో మునిగిపోయారు. దర్శకుడు మురుగదాస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్ ను ఏ స్థాయిలో ప్రెజెంటర్ చేశారో చూడాలని ఉవ్విళ్ళూరుపోతున్నారు.

మామూలుగా నిన్న మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు సందర్బంగా టీజర్ రిలీజవాల్సి ఉండగా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుగారు మరణించడంతో విడుదలను ఈరోజుకి వాయిదా వేశారు. ఇకపోతే మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పబడుతున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తుండగా మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook