‘పెన్నీ’ సాంగ్ లీక్ పై క్లారిటీ ఇచ్చిన “సర్కారు వారి” మేకర్స్.!

Published on Mar 20, 2022 2:23 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మరియు అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న క్రేజీ సినిమా నుంచి మేకర్స్ ఒక్కో చార్ట్ బస్టర్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన ఫస్ట్ సాంగ్ భారీ రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు పక్కా స్టైలిష్ నెంబర్ పెన్నీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే అనుకోని విధంగా ఈ సినిమా ఈరోజు సాయంత్రం కాకుండా ముందే ఓ ఆన్లైన్ ఆడియో యాప్ లో ఫుల్ గా ముందే వచ్చేయడం షాకింగ్ గా మారింది. అయితే దీనిపై ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సాంగ్ ను ముందే పలు యాప్స్ వారికి టెస్టింగ్ కోసం పంపడం జరుగుతుంది అని వాటిలో ఒకరిని నుంచి సాంగ్ లీక్ అయ్యిపోయింది. ఇప్పుడు దాన్ని సెట్ చేసేసాం అని.

మరి ఈ సాంగ్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఆ సమయం కోసం టైం లాక్ చేసుకొని మహేష్ ఫ్యాన్స్ మరియు మ్యూజిక్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది అని తెలుస్తుంది. మహేష్ స్టెప్స్ కానీ సితార గాని బిగ్ హైలైట్ గా కనిపిస్తారని టాక్. మరి సాయంత్రం వచ్చే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :