ఉగాది బ్లాస్ట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిటింగ్.!

Published on Mar 18, 2023 4:05 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి మంచి క్రేజీ గా ఉన్న పలు సాలిడ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇద్దరికీ సరైన హిట్ ట్రాక్ లేకపోయినప్పటికీ ఈ హ్యాట్రిక్ కాంబో పై నెక్స్ట్ లెవెల్ హైప్ ఇప్పుడు నెలకొంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొన్ని ఫొటోస్ మంచి వైరల్ గా మారుతుండగా షూటింగ్ ని కూడా మేకర్స్ శరవేగంగా చేస్తున్నారు.

ఇక మరో పక్క అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి ఈ ఉగాది అప్డేట్ కోసం అభిమానులు మాత్రం చాల ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. సినీ వర్గాల నుంచి కూడా ఈ సినిమా ఉగాది అప్డేట్ కి సంబంధించి సర్వత్రా సాలిడ్ బజ్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. దీనితో ఉగాది బ్లాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఉందని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఉగాదికి సినిమా టైటిల్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టి టాక్ ఉంది. మరి మేకర్స్ ఈ ఉగాది కానుకగా ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :