రేపట్నుంచి మహేష్ సినిమా కొత్త షెడ్యూల్!

mahesh-and-murugu-das
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లో శరవేగంగా జరుగుతూ వచ్చిన షెడ్యూల్‌కు బ్రేక్ ఇచ్చి, మురుగదాస్ తన హిందీ సినిమా ‘అకిరా’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో కొద్దిరోజులు ముంబై వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ‘అకిరా’ పనులన్నీ పూర్తి చేసిన ఆయన, రేపట్నుంచి మహేష్ సినిమా షూటింగ్‌ను మళ్ళీ మొదలుపెడుతున్నారు. రేపట్నుంచి ఈనెల 30వరకూ హైద్రాబాద్‌లోనే షూటింగ్ జరగనుంది.

ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురుగదాస్ శైలిలోనే ఓ బలమైన సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సంతోష్ శివన్, హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.