‘భరత్ అనే నేను’ కు కాస్త బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు !
Published on Sep 25, 2017 3:10 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘స్పైడర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానుండటంతో ప్రచారంపై కాస్త ఎక్కువ దృష్టిపెట్టారు మహేష్. నిన్న చెన్నై, బెంగుళూరుల్లో టీవీ, ప్రింట్, వెబ్ మాధ్యమాలను కలిసి మాట్లాడిన మహేష్ ఈరోజు హైదరాబాద్లో తెలుగు మీడియాతో సమావేశం కానున్నారు.

ఇలా అన్ని రకాల ప్రమోషన్లతో బిజీగా ఉండటం వలన మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగుకు కాస్త బ్రేక్ ఇవ్వవలసి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఒకసారి ‘స్పైడర్’ ప్రచార షెడ్యూల్ ముగియగానే మహేష్ తిరిగి ఈ షూట్లో జాయిన్ అవుతారట. గతంలో మహేష్, కొరటాల శివల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో ఒకటి, 2018 ఆఖరుకు రాజమౌళితో ఒక సినిమాను కుదుర్చుకుని రాబోయే రెండేళ్ల కాలంలో మహేష్ ఫుల్ బిజీగా గడపనున్నారు.

 
Like us on Facebook