ఇంతటి విషాదంలో కూడా మహేష్ సేవ ఆగలేదు..!

ఇంతటి విషాదంలో కూడా మహేష్ సేవ ఆగలేదు..!

Published on Nov 18, 2022 7:05 AM IST

ఇటీవల మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంత తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ తండ్రి తెలుగు సినిమా శిఖరం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు స్వర్గస్తులు అయినారు. దీనితో వారి ఇంట మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఇంతటి విషాద సమయంలో కూడా మహేష్ అందించే సేవ మాత్రం ఆగకపోవడం మహేష్ ఉన్నతమైన లక్షణాన్ని చూపిస్తుంది.

మహేష్ గత కొంత కాలం నుంచి తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మహేష్ ఇంట ఇంత తీవ్ర విషాదం నెలకొన్నా సరే నిన్న మొక్షిత్ సాయి అనే చిన్నారి మహేష్ ఫౌండేషన్ మూలాన ఊపిరి పోసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ వార్త తెలిసిన అభిమానులు ఇతర నెటీజన్స్ మహేష్ ఉన్నతమైన మనసుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు