మరో అదిరే సీక్వెన్స్ లో మహేష్..పిక్స్ వైరల్.!

Published on Sep 16, 2021 9:00 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే శరవేగంగా షూట్ ని జరుపుకుంటుంది. అయితే ఈ షూట్ లో సినిమాకి చెందిన మరో హైలైట్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సీక్వెన్స్ కి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బులెట్ బండిపై అంతే సూపర్ స్టైలిష్ లుక్స్ లో మహేష్ కనిపిస్తున్నారు. పైగా అక్కడ ఆ పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఏదో సీరియస్ సన్నివేశాన్నే ప్లాన్ చేసినట్టుగా అర్ధం అవుతుంది. మరి ఇదేంటో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సహా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :