హాలీవుడ్ లుక్ లో మహేష్..లేటెస్ట్ పిక్ వైరల్.!

Published on Nov 26, 2021 8:00 am IST

మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోస్ లో మొట్ట మొదటగా ఉండే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికీ కూడా అదే యంగ్ లుక్ లో కనిపిస్తూ మహేష్ ఆశ్చర్యపరుస్తాడు. తన సినిమా సినిమాకి కూడా ఇప్పుడు ఒక యంగ్ లుక్ ని రెడీ చేస్తున్న మహేష్ ఒక్క సినిమాలు పరంగా మాత్రమే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అదిరే లుక్స్ లో మహేష్ స్టన్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలా వైరల్ అయ్యిన కొన్ని స్టన్నింగ్ లుక్స్ లో ఇప్పుడు లేటెస్ట్ పిక్ కూడా చేరాల్సిందే. ఓ ఖరీదైన బైక్ పై అదిరే డ్రెస్సింగ్ లో ఫోన్ పట్టుకొని మహేష్ కనిపిస్తున్నాడు. ఇదే లుక్ ఏదన్నా హాలీవుడ్ సినిమాలోదా? అన్నట్టు ఉన్నాడు. దీనితో ఈ లుక్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే మహేష్ తన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” షూట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ రాజమౌళిలతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :