కంప్లీట్ రెస్ట్ మోడ్ లో సూపర్ స్టార్ మహేష్.!

Published on Dec 15, 2021 7:05 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురాం పెట్ల “సర్కారు వారి పాట” అనే సాలిడ్ స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మహేష్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 90 శాతం కంప్లీట్ చేసేసారు. అయితే ఈ సినిమా షూట్ నుంచి చిన్న బ్రేక్ లో మహేష్ తనకి ఎప్పుడు నుంచో చేయించుకోవాల్సిన మోకాలి సర్జరీ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యారని తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సర్జరీ ని మహేష్ ముగించుకున్నారట.

ప్రస్తుతం మహేష్ ఈ ఆపరేషన్ ముగించుకొని దుబాయ్ లో కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి మహేష్ పూర్తిగా కోలుకోడానికి ఒక రెండు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాతే మళ్లీ సర్కారు వారి పాట సినిమా బ్యాలన్స్ షూట్ ని స్టార్ట్ చెయ్యనున్నారట. అలాగే అనుకున్న సమయానికే మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :