రేపటి నుండి మొదలుకానున్న మహేష్ – కొరటాల చిత్రం !


మహేష్ బాబు, కొరటాల సేవల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘శ్రీమంతుడు’ చిత్రం మహేష్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే వీరి కలయికలో రూపొందనున్న మరో సినిమాపై ప్రేక్షకుల్లో, పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపాత్రే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ రేపటి నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. ఈ మొదటి షెడ్యూల్లో నటుడు శరత్ కుమార్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.

మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ తాలూకు అన్ని పనులు పూర్తవగానే మహేష్ బాబు షూటింగ్లో జాయిన్ అవుతారు. ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ను ఖరారు చేసిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను 2018 ఆరంభంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.