మహేష్ – కొరటాల శివ సినిమా షూటింగ్ అప్డేట్ !


‘స్పైడర్’ పనులన్నింటినీ ముగించేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన పూర్తి సమయాన్ని కొరటాల శివ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇంతకు ముందే కొద్దిగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణను జరుపుకుంటోంది. అక్కడ వేసిన భారీ అసెంబ్లీ సెట్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ షూట్లో మహేష్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఇందులో మహేష్ సరసన కొత్త నటి కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ – కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్టవడంతో ఈ ప్రాజెక్టుపై కూడా భారీ క్రేజ్ నెలకొని ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనున్న ఈ సినిమాకి ‘భరత్ అనే నేను’ టైటిల్ ప్రచారంలో ఉన్నా ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.