మహేష్ – కొరటాల సినిమా షూటింగ్ అప్డేట్ !
Published on Jul 30, 2017 7:25 pm IST


‘శ్రీమంతుడు’ సక్సెస్ ను రిపీట్ చేయడానికి మహేష్ బాబు, కొరటాల శివలు కలిసి చేస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈరోజు నగరంలోని మోతీనగర్లో ఉన్న డాన్ బాస్కో పాఠశాలలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. సామాజిక అంశాల ఆధారంగా సినిమాలు రూపొందించే కొరటాల శివ ఈ చిత్రాన్ని దేశభక్తి నైపథ్యంలో రూపొందిస్తున్నారని వినికిడి.

అలాగే ముందు నుండి వినిపిస్తున్నట్టు ఈ చిత్రం పొలిటికల్ పార్టీలను ఉద్దేశించి తీస్తున్నది కాదని కూడా కొరటాల ఇంతకుముందే క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూరుస్తుండగా 2018 ఆరంభంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook