సూపర్ కూల్ అండ్ హ్యాండ్సమ్ గా మహేష్… వైరల్ అవుతోన్న సరికొత్త పిక్!

Published on Oct 22, 2021 5:21 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరో అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో మహేష్ బాబు లుక్ స్టన్నింగ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ లో మహేష్ లుక్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో మహేష్ సూపర్ కూల్ గా మరియు హ్యాండ్సమ్ గా ఉన్నారు.

థమన్ ఈ ఫోటో ను షేర్ చేస్తూ, పాటలను కంపోజ్ చేయడం పూర్తి అయింది అని, సూపర్ స్టార్ మహేష్ ఎంతో మెరిసి పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ పతకాల పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :