మహేష్ స్టేట్మెంట్ తో ఆ సినిమాపై డౌట్..?

Published on Oct 15, 2021 3:00 pm IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన లైనప్ ని మరింత సాలిడ్ గా ప్రిపేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అయితే దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ ని చేస్తుండగా దీని తర్వాత తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళితో భారీ సినిమాలు ఉన్నాయి.

అయితే నిన్న లేటెస్ట్ గా మహేష్ చేసిన స్టేట్మెంట్స్ కాస్త ఆసక్తిగా మారాయి. తన పాన్ ఇండియన్ ఎంట్రీ రాజమౌళి సినిమాతోనే ఉంటుంది అని మహేష్ క్లారిటీ ఇచ్చారు. సరైన టైం లో మంచి ఆ టైం కి తగ్గ సినిమా చేయాలి అనుకుంటాను అలా తన మొదటి పాన్ ఇండియన్ సినిమా రాజమౌళితో చెయ్యాలని దానితో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని తెలిపారు.

మరి ఇక్కడే అసలు డౌట్ మొదలయ్యింది. ఆల్రెడీ త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ని కూడా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని అనౌన్స్ చేశారు. దీనితో కాస్త సంశయం మహేష్ అభిమానుల్లో నెలకొంది. మరి మహేష్ చేసే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఏదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :