వంశీతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నానన్న మహేష్ !
Published on Jul 27, 2017 4:10 pm IST


మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ సినిమా పనులన్నిటినీ ముగించేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నారు. చిత్ర షూటింగ్ కూడా చక చకా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమా మహేష్ యొక్క 25వ చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఆ అంచనాలను రీచ్ అవడం కోసం వంశీ పైడిపల్లి కూడా బలమైన స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు. మహేష్ కూడా ఈ సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈరోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన మహేష్ ఆయనతో చేయబోయే సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు కూడా తెలిపారు. యూఎస్ బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టనున్నారు.

 
Like us on Facebook