చార్మింగ్ మహేష్..స్టన్నింగ్ చరణ్..అదరగొట్టిన ఇద్దరూ!

Published on Sep 18, 2021 10:02 am IST

ఏ హీరో అభిమాని అయినా కూడా తమ హీరోలు ఎంత యంగ్ గా అందంగా కనిపిస్తారో అంత హ్యాపీ ఫీల్ అవుతారు.. ఇది నిజం. మరి ఇప్పుడు అలాంటి ట్రీట్ నే గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తన అభిమానులకి తమ లేటెస్ట్ లుక్స్ తో తమ అభిమానులకు సూపర్ కిక్ అందిస్తున్నారు. నిన్ననే ఇద్దరు హీరోలకి సంబంధించిన సరికొత్త యాడ్ లుక్స్ బయటకి రాగా..

వాటిలో మహేష్ తనదైన యంగ్ లుక్ తో చాలా చార్మింగ్ గా కనిపిస్తుండగా చరణ్ మాత్రం తన రామరాజు లుక్ తోనే అదిరే డ్రెస్సింగ్ లో కనిపించి స్టన్ చేసాడు. దీనితో ఇప్పుడు వీరిద్దరి నయా లుక్స్ నే మంచి వైరల్ అవుతుండగా అభిమానుల్లో కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి. మరి ప్రస్తుతం మహేష్ బాబు తన “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా చరణ్ తన భారీ చిత్రాలు కంప్లీట్ చేసి శంకర్ తో సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :