మహేష్ మరీ ఇంత భిన్నంగా ఆలోచిస్తున్నాడు ఎందుకు !

mahesh
‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ తరువాత మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో ఒక సినిమానై మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో మహేష్ ఐబీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి హీరోయిన్, లొకేషన్స్ అన్నీ కుదిరి సగం పైగా షూట్ కంప్లీట్ అయినా నిన్నటి దాకా టైటిల్ అనేది పెట్టకుండా వర్కింగ్ టైటిల్ తోనే పని కానిచ్చేశారు. ఎందుకంటే ఇన్నాళ్లుగా ఈ సినిమా కథకి సూటయ్యే టైటిల్ దొరకలేదు. మొదట ఏజెంట్ శివ అంటూ రకరకాల పేర్లు వినిపించినా చివరకు ‘సంభవామి’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

భగవద్గీతలోని శ్లోకాల్లో అధర్మాన్ని సంహరించడానికి ఒక విశిష్ట వ్యక్తి అవసరం అని ప్రస్తావించే సందర్భంలో పలికే ‘ధర్మ సంస్థాపనార్థాయ’ శ్లోకంలో చివరగా సంభవామి యుగే యుగే అనే పదం వస్తుంది. ఈ సినిమాలో కూడా మహేష్ పాత్ర చెడుకు వ్యతిరేకంగా పోరాడే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఉండనుండటంతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే మహేష్ – కొరటాల సినిమాకి కూడా ‘భరత్ అనే
నేను’ అనే డిఫరెంట్ టైటిల్ ను కుదిర్చారు. ఈ టైటిల్స్ అన్నీ చూస్తుంటే మహేష్ పూర్తిగా డిఫరెంట్ గా ఆలోచిస్తూ రొటీన్ కు భిన్నంగా ఉండేలా సినిమాలు చేస్తున్నాడని స్పష్టమవుతోంది.

Exit mobile version