మహేష్ సినిమాపై మురుగదాస్ లేటెస్ట్ అప్‌డేట్!

29th, August 2016 - 11:53:20 PM

murugudas
సౌతిండియన్ సినిమాలో పాపులర్ డైరెక్టర్స్‌లో ఒకరైన దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. గత నెల్లో సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ మురుగదాస్, మహేష్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా మొదట్నుంచీ చెబుతున్నట్లే ఈ సినిమాను రెండు భాషల్లో ఏకకాలంలోనే తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మహేష్‌తో సహా మిగతా నటీనటులంతా రెండు భాషల కోసం వేర్వేరుగా, రెండు సార్లు నటిస్తున్నారని, ఇది పక్కా ద్విభాషా చిత్రమని మురుగదాస్ స్పష్టం చేశారు. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుమారు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.