ముంబైలో మహేష్ – మురుగదాస్ !

19th, February 2017 - 08:00:12 PM


సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆకరిదాస షూటింగ్లో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షెడ్యూల్ జరుపుకుంటోంది. ముంబైలోని చిదంబరం షిప్ యార్డ్ లో ఈ షూట్ జరుగుతోంది. ఇందులో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ కూడా చకా చకా రెడీ అవుతోంది.

మురుగదాస్ ఈ టీజర్ ను ప్రత్యేకంగా యూకే లో రూపొందిస్తున్నారు. హైక్వాలిటీ విజువల్స్ తో ఉండే ఈ టీజర్ 47 సెకన్ల నిడివి ఉండి అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుందట. ఈ టీజర్ తోనే సినిమా టైటిల్ ఏంటనేది కూడా తెలిసిపోనుంది. కనుక అభిమానులంతా ఎప్పుడెప్పుడు టీజర్ రీలీజవుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.