మరికొద్దిసేపట్లో మహేష్ కొత్త సినిమా ప్రారంభోత్సవం !


మహేష్ బాబు అభిమానులకు ఈరోజు చాలా స్పెషల్ గా మారనుంది. ఎందుకంటే మహేష్ కెరీర్లో మైలురాయిగా భావిస్తున్న 25వ చిత్రం ఈరోజే ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబందించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకో గంట వ్యవధిలో పూజా కార్యక్రమాలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఇప్పటి వరకు మహేష్ చేయని తరహాలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు కూడా ఈ స్క్రిప్ట్ పట్ల ఎగ్జైటెడ్ గా ఉన్నానని, సినిమా మొదలుపెట్టడం కోసం ఎదురుచూస్తున్నానని తన ఆసక్తిని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.