అడివి శేష్ “మేజర్‌” ని ప్రమోట్ చేస్తున్న మహేష్

Published on May 29, 2022 10:47 pm IST


అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ జూన్ 3, 2022 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించారు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.

అడివి శేష్‌తో కలిసి మహేష్ బాబు ఓ స్పెషల్ ఫన్నీ వీడియోలో కనిపించి సినిమాను ప్రమోట్ చేసినట్లు లేటెస్ట్ న్యూస్. సర్కారు వారి పాటను కూడా ప్రమోట్ చేసిన ప్రముఖ యూ ట్యూబర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఈ వీడియో కాన్సెప్ట్‌ను రూపొందించారు. కొద్ది సేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మేజర్ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :