మహేష్ ఫస్ట్ లుక్ కి ట్విట్టర్ నుంచి ఈ రివార్డ్.!

Published on Dec 9, 2021 3:39 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ సినిమా “సర్కారు వారి పాట”. వరుస ప్రాజెక్ట్ లు తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చి మహేష్ స్టార్ట్ చేసిన సినిమా పైగా సాలిడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ గా నిలిచింది.

అందుకే ప్రతీ చిన్న అప్డేట్ కూడా ఈ సినిమా నుంచి అదిరే రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మహేష్ హ్యాండిల్ నుంచి మహేష్ బర్త్ డే కానుకగా రిలీజ్ చెయ్యగా దానికి ట్విట్టర్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి దీనిని ఈ ఏడాది ట్విట్టర్ ఎంటర్టైన్మెంట్ క్యాటగిరిలో మోస్ట్ క్వోట్ ట్వీటెడ్ ట్వీట్ గా నిలిచినట్టు తెలిపారు.

అలాగే మోస్ట్ లైక్డ్ మరియు రీట్వీటేడ్ పోస్ట్ గా విజయ్ నటించిన బీస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి రివార్డ్ అందించారు. దీనిని బట్టి ఈ రెండు సినిమాల పట్ల అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :