మహేష్ లోని ఇంటెన్స్ మోడ్ తో “సర్కారు వారి” నుంచి మాస్ పోస్టర్.!

Published on Apr 2, 2022 5:09 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మహేష్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఇప్పుడు ఈ ఉగాది కానుకగా ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చెయ్యగా ఒక్కసారిగా అభిమానుల్లో కుతూహలం మొదలైంది.

మరి మేకర్స్ ఎలాంటి పోస్టర్ ని రిలీజ్ చేస్తారా అని చూస్తుంగా ఈ పండుగకి మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఓ సరైన మాస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది మాత్రం అభిమానులకి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో మహేష్ మాంచి ఇంటెన్స్ గా కనిపిస్తూ అదిరే యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.

మొత్తానికి అయితే ఈ పండుగకి మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ తో ఈ రోజు కంప్లీట్ అయ్యిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే మే 12న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :