నేటి ఉదయం సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్, వై ఎస్ భారతి గారిని ఆమె నివాసంలో కలిశారు. ఒక ప్రాజెక్ట్ విషయమై వీరిద్దరూ కలవడంతో విశేషత సంతరించుకుంది. విషయంలోకి వెళితే మహేష్ గతంలో తెలుగు రాష్ట్రాలలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొన్నారు. తన సొంత ఖర్చులతో కొన్నేళ్లుగా మహేష్ ఆ గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని బుర్రెపాలెం గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకోవడం జరిగింది. కావున ఆ గ్రామ అభివృద్ధి ప్రణాళిక గురించి వై ఎస్ భారతి తో చర్చించడానికి నమ్రత ఆమె నివాసానికి వెళ్లడం జరిగింది.
కాగా గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో కల బుర్రెపాలెం నటశేఖర కృష్ణ సొంత ఊరు కావడం విశేషం. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న సంగతి తెలిసిందే.
