ఫైనల్ షెడ్యూల్ మొదలెట్టిన మహేష్..!

Published on Nov 7, 2021 11:04 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ ను మొదలెట్టింది. అంతేకాక ఈ లాస్ట్ షెడ్యూల్ డిసెంబర్ నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More