మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

Published on Jul 29, 2021 7:59 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. అయితే ఈ చిత్రం లో మహేష్ బాబు నూ మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను జులై 31 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్ ఆన్ 31 జూలై అంటూ చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబు పుట్టిన రోజు దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ ను ఆగస్ట్ 9 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :