అప్పుడే ఆల్ టైం రికార్డ్స్ కంట్రోల్ లో పెట్టేసిన మహేష్..!

Published on Aug 1, 2021 8:43 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి నిన్ననే మాస్ అప్డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ లతో పాటుగా మరో బ్లాస్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. అయితే నిన్న మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భారీ రికార్డులు సెట్ చెయ్యాలని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ కాగా ఇప్పుడు మహేష్ పేరిట సోషల్ మీడియాలో ఆల్ టైం రికార్డులు అప్పుడే వచ్చి పడుతున్నాయి.

ముఖ్యంగా మహేష్ హ్యాండిల్ నుంచి రిలీజ్ కాబడ్డ ఫస్ట్ లుక్ పోస్టర్ కేవలం 15 గంటల్లోనే 80 వేల లైక్స్ మరియు లక్షకి పైగా కామెంట్స్ వచ్చేసాయి. దీనితో ఈ సాలిడ్ ఫాస్టెస్ట్ ఆల్ టైం రికార్డు మహేష్ కంట్రోల్ లోకి వచ్చేసింది. అలాగే 24 గంటలు పూర్తయ్యే సరికి మాత్రం మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పటి నుంచే మహేష్ తన హంట్ షురూ చేసేసారు. ఇక ఫుల్ స్క్రీన్ పై పెట్లా చూపిస్తారో తెలియాలి అంటే వచ్చే జనవరి 13 వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :